మహబూబ్‌నగర్ టౌన్, జూలై 15 : ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరులో 30 ఏండ్లు బైపాస్పేరిట టైంపాస్ చేశారని.. తెలంగాణ ప్రభుత్వం కేవలం తొమ్మిదేండ్లలో అనేక బైపాస్ రోడ్లు నిర్మించి ప్రజలు, వాహనదారుల కష్టాలు తీర్చామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర చౌరస్తాలో రూ.1.76కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన బైపాస్ సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకరంతో బైపాస్ రోడ్డు పూర్తి చేసి పట్టణ ప్రజల కలను నెరవేర్చామని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో మరింత కల వస్తుందని, నెలరోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. భూత్పూర్-మహబూబ్‌నగర్ చేరుకునేందుకు ఫోర్‌లైన్ రోడ్డు అందుబాటులో ఉం దన్నారు. త్వరలో దివిటిపల్లి నుంచి ఐటీటవర్ మీదుగా బైపాస్ ద్యారా పట్టణాన్ని చేరుకునేందుకు మరో లైన్ రోడ్డు అందుబాటులోకి వస్తుందన్నారు. ఐటీ, ఇండస్ట్రీయల్ కారిడార్‌ను బైపాస్‌రోడ్డుకు కనెక్ట్ చేస్తామన్నారు. ప్రస్తుత బైపాస్ రోడ్డుకు కొనసాగింపుగా క్రిష్టయన్పల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ మీదుగా చిన్నదర్పల్లి వరకు మరో బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా కేంద్రానికి అన్నివైపులా విశాలమైన రోడ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయస్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహించామని, ఈ నెల 23న సాయంత్రం 7గంటలకు 450డ్రోన్లతో మెగా డ్రోన్‌షో నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. పట్టణ ప్రజలు తరలివచ్చి డ్రోన్ షోను తిలకించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక క్షేత్రాలు, ముఖ్యమైన ప్రదేశాలను డ్రోన్ షో లైటింగ్ ద్యారా వీక్షించవచ్చన్నారు. మిగతా ఉమ్మ డి జిల్లా కేంద్రంల్లోనూ ఈ ప్రదర్శన ఉం టుందని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ కో రమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చై ర్మన్ తాటిగణేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, నాయకులు శాంతయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు కోరమోని వనజా, అనంతరెడ్డి, నరేందర్ ఉన్నారు.