మద్దిమడుగులో ముగిసిన ఉత్సవాలు
పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు మంగళవారం గాయత్రీ మహాయజ్ఞంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం విఘ్నేశ్వరపూజ గవ్యాంతరపూజ, మన్యుసూక్తములతో ఆంజనేయస్వామి వారికి 108 కలశములతో మహాకుంభాభిషేకం నిర్వహించిన అనంతరం వేద పండితులు హనుమాన్ గాయత్రీ మహాయజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు.
అమ్రాబాద్, డిసెంబర్ 26 : పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు మంగళవారం గాయత్రీ మహాయజ్ఞంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం విఘ్నేశ్వరపూజ గవ్యాంతరపూజ, మన్యుసూక్తములతో ఆంజనేయస్వామి వారికి 108 కలశములతో మహాకుంభాభిషేకం నిర్వహించిన అనంతరం వేద పండితులు హనుమాన్ గాయత్రీ మహాయజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. హనుమాన్ మాలధారణ స్వాములు స్వామి సన్నిధికి చేరుకొని ఇరుముడులను సమర్పించి మాల విరమణ చేశారు.
స్వాములు, భక్తులు గోధుమపిండి, బెల్లంతో చేసిన ప్రత్యేక నైవేద్యాన్ని అంజన్నకు సమర్పించి గుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉత్సవాలను పూర్తి చేసిన ఆలయ సిబ్బందికి, భక్తులకు సహకరించిన ప్రజలకు ఆలయ ఈవో రంగాచారి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

