అచ్చంపేట, మే 23 : నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో అనుకోని అతిథి కనిపించింది. నల్లమల ప్రాంతంలో ఫరహాబాద్ చెక్‌పోస్టు నుంచి కిలోమీటరు దూరంలో అప్పాపూర్-ఫరహాబాద్ వ్యూపాయింట్‌కు వె ళ్లే దారిలో అరణ్యవీరుడు అడవిదున్న ప్రత్యక్షమైంది. మ న్ననూర్ ఐటీడీఏలో ఏఈగా పనిచేస్తున్న రఘు అప్పాపూ ర్లో రాష్ట్ర గవర్నర్ నిధుల ద్వారా జరుగుతున్న చె క్‌డ్యాం నిర్మాణ పనులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాత్రూం మరమ్మతు పనులు పరిశీలించేందుకు శుక్రవా రం ఉదయం కారులో అప్పాపూర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఫరహాబాద్ చెక్‌పోస్ట్‌కు(పులిబొ మ్మ) కిలోమీటర్ దూరంలో గడ్డి తింటూ అడవిదున్న కనిపించింది.
మొదటగా ఎలుగుబంటి అనుకొని భయపడిన ఏఈ రఘు కొద్దిసేపటికి జంతువు తలపైకెత్తి చూడగా కొ మ్ములు కనిపించాయి. కాస్త దగ్గరికెళ్లి చూడగా అడవిదు న్న కనిపించింది. ఆ దృశ్యాన్ని తనఫోన్‌లో బంధించి చెక్‌పోస్టు వద్ద ఉన్న అటవీ సిబ్బందికి విషయం తెలుపగా మొదట్లో వారు కూడా నమ్మలేదు. అడవిదున్న ఇక్కడ ఎందుకుంటుందని, నీలిగాయి ఉండొచ్చని భావించిన అటవీ సిబ్బంది ఫొటోను పరిశీలించి కొమ్ములు, శరీర ఆకృ తి చూసి అడవిదున్నగా నిర్ధారించుకొని ఉన్నతాధికారుల కు సమాచారం అందించారు. అనంతరం అక్కడి నుంచి సిబ్బంది కెమెరాలు తీసుకొని అడవిదున్న కోసం వెళ్లినట్లు ఏఈ రఘు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. గతేడాది ఒకసారి కనిపించిన అడవిదున్న మళ్లీ ఏడాది తర్వాత న ల్లమలలో తిరిగి కనిపించడంతో అటవీ సిబ్బంది, ప్రకృతి ప్రేమికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్రానికి ముందు బ్రిటిషర్ల కాలంలో 1870లో నల్లమల అటవీ ప్రాంతంలో అడవిదున్న చివరిసారిగా కనిపించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుంచి నల్లమలలో అడవిదున్న జాడ లేకుండా పోయింది. 155 ఏండ్ల తర్వాత అరుదైన జంతువు అడవిదున్న నల్లమల లో ప్రత్యక్షమైంది. అత్యంత శక్తివంతమైన అడవి జంతువుల్లో అడవిదున్న ఒకటి. పెద్ద శరీరం, బలమైనకాళ్లు, గట్టి పాదాలు, మెరిసే నల్లని చర్మం, మగ దున్న అయితే 800 నుంచి 1000 కిలోల బరువు ఉంటుంది. ఎత్తు భూజాల వద్ద దాదాపు 6అడుగులు, పొడవు 8 నుంచి 10 అడుగులు ఉంటుంది. తల వెడల్పుగా, బలంగా ఉంటుంది. రెండు కొమ్ములు తలపైభాగం నుంచి పైకి అర్థచంద్రకారంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 25 ఏండ్లవరకు జీవించే అవకాశం ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.