దేవరకద్ర, జనవరి 7: మండలంలోని పెద్ద గోప్లాపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతిచెందినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మహబుబ్‌నగర్ నుంచి మరికల్ వైపు వెళ్తున్న కర్ణాటకు చెందిన ఎర్టిగా కారు రోడ్డుపై మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి శక్తినగర్ నుంచి బొగ్గులోడ్‌తో హైదరాబాద్ వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్ట్టడంతో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టీపర్లో ఇరుక్కుపోయిన కారును జేసీబీ సహాయంతో బయటికి తీసి అందులో ఉన్న ఆరుగురిలో నలుగురిని 108లో జిల్లా దవాఖానకు తరలించారు. కారు డ్రైవర్ సీటులోనే ఇరుకుపోవడంతో జేసీబీతో బయటికి తీశారు. దవాఖానకు తరలించిన వారిలో చికిత్సపొందుతూ ఇద్దరు మృతిచెందారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇరువైపులా దాదాపు కిలో మీటర్ మేర వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.