తిమ్మాజిపేట : తిమ్మాజిపేట మండలం చేగుంట (Chegunta) గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని (Ambali Center) శుక్రవారం ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త మారేపల్లి సురేందర్ రెడ్డి ( Surendhar Reddy) చేగుంట గేటు వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు.
గ్రామానికి వచ్చి పోయే వారికి, వృద్ధులకు కోసం అంబలి కేంద్రం ఏర్పాటు చేసినట్లు యువజన సంఘం ప్రతినిధులు గాలి రాజు, గడ్డం చెన్నయ్య తెలిపారు. గేట్ వద్ద అటుగా ప్రయాణికుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిల్లె మల్లయ్య, శ్రీశైలం, వెంకట్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.