మరికల్ : నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు స్టేజీ వద్ద తీలేరు మాజీ సర్పంచ్ వెంకరెడ్డి, వజ్రమ్మ, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని (Ambali Center ) డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ( Prasanth Kumar Reddy) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీలేరు మాజీ సర్పంచ్ వెంక రెడ్డి 42 యేండ్ల క్రితం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాగి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అప్పటినుంచి వేసవిలో నిర్విరామంగా ఈ అంబలి కేంద్రాన్ని ప్రారంభించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ జడ్పీటీసీ ప్రదీప్ కుమార్ గౌడ్, తీలేరు మాజీ సర్పంచ్ రేవతమ్మ, మాజీ ఉప సర్పంచ్ బజారప్ప, నాయకులు రాజు, తిమ్మారెడ్డి, నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య , రాములు, అంజిరెడ్డి, కురుమన్న, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.