మహబూబ్‌నగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో అద్దెకు తీసుకొని కల్తీ కల్లులో కలిపే క్లోరోహైడ్రేడ్ (సీహెచ్-ఆల్పాజోలం) తయారీ యూనిట్లపై జరిగిన దాడి వెనుక అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని నార్కోటిక్ బృందం దాడులు చేసి నకిలీ సీహెచ్ కేంద్రంలో దాడులు నిర్వహిస్తుండగా భారీ ఎత్తున మత్తు పదార్థాలు లభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెద్దఎత్తున డబ్బు కూడా ఈ తయారీ కేంద్రంలో లభించినట్లు ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా కల్లులో కలిపేందుకు తయారు చేసే మత్తు పదార్థాల కేంద్రంపై దాడికి దిగిన కొద్దిసేపటికే ఓ మంత్రి నుంచి ఫోన్ కాల్ రావడం అతని సమీప బంధువు ఒకరు అక్కడికి చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కల్తీ మత్తు పదార్థాలతో పాటు భారీ ఎత్తున నగదును గుర్తించినట్లు సమాచారం. వీటిని గుట్టుగా మంత్రి ఆదేశాలతో తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత కొన్ని నెలలుగా గుట్టుగా సాగుతున్న ఈ దందా గురించి జిల్లా ఎక్సైజ్ అధికారులకు తెలిసిన పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాకు కనీస స మాచారం ఇవ్వకుండా అధికారులు గుట్టు గా దాడులు చేయడం అక్కడ దొరికిన సామగ్రితోపాటు మ త్తు పదార్థాలను
స్వాధీనం చేసుకోవడం వాటి విలువ రూ.లక్షల్లో ఉందని చెప్పడం చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యవహారం నడిచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ తయారు చేసే నకిలీ మత్తు పదార్థం కేజీ రూ.5 లక్షలకుపైగా విలువ చేస్తుందని తయారీదారులే ఒప్పుకొంటున్నారు. అయితే రూ.కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలు దొరికితే దాన్ని తక్కువ చేసి చూపించడంలో ఎవరి పాత్ర ఉందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈగల్ ఫోర్స్ తెలంగాణకు చెందిన హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈనెల 19న మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం, అన్నాసాగర్ శివారులోని లక్ష్మీనరసింహ పౌల్ట్రీ ఫాంపై దాడి చేశారు. ఆ ప్రాంగణంలో పనిచేస్తున్న ఆల్పాజోలం తయారీ యూనిట్‌ను బృందం విజయవంతంగా ఛేదించింది. ఆల్పాజోలం మత్తుమందుతో పాటు అన్ని తయారీ పరికరాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నది. ప్రధాన నిందితుడు జయప్రకాశ్‌గౌడ్ ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సిండికేట్ నాయకుడు. సికింద్రాబాద్‌లోని బోయినపల్లిలోని మేధా హైస్కూల్లో ఇదే తరహాలో యూనిట్‌ను నడుపుతున్నందుకు గతంలో (క్రైమ్ నెం.09/2025 (NPS చట్టంలోని సెక్షన్ 8(సీ), 21(సీ), 29 కింద) ఇతన్ని అరెస్టు చేశారు.
ఇతడిని 13/09/2025న అరెస్టు చేయగా, 16/03/2026 వర కు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. అతను విడుదలైన తర్వా త వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలనే కండీషన్ బెయిల్ ఉన్నది. అయితే ప్రధాన నిందితుడు అదే నేర కా ర్యకలాపాలను కొనసాగిస్తూ అక్రమ నెట్‌వర్క్‌ను తిరిగి స్థాపించాడనే అనుమానంతో ఈగల్ ఫోర్స్ అతనిపై నిఘా ఉంచి అతడి కార్యకలాలపు పసిగట్టి మరోసారి పట్టుకున్నారు. గతంలో పరారైన మరో కీలకమైన సీహెచ్ కృష్ణయ్యగౌడ్ ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో చురుకుగా సహకరించా డు. ఇక్కడ ఉత్పత్తి అయిన ఆల్పాజోలంను కల్లు కల్తీ కోసం స్థానిక డీలర్లకు సరఫరా చేస్తున్నారని, దీనివల్ల మహబూబ్‌నగర్ సమీప జిల్లాల్లోని కల్లు ప్రియులు తాగి ఊగుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో కల్తీ మత్తు పదార్థాలు తయారు చేసే వ్యక్తులకు జిల్లాలోని కొంతమంది అధికార పార్టీ మద్దతుదారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహబూబ్‌నగర్ కల్లు పారిశ్రామిక సంఘం ఎన్నికలు జరగడం, కొంతమంది అధికార పార్టీలోకి వెళ్లి దీన్ని దక్కించుకోవడం, గతంలో కల్తీకల్లు దందా నడిపిన అనుభవం ఉండడం వల్ల ఈ అక్రమ మత్తు తయారీ వ్యక్తులతో సాన్నిహిత్యం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్, హన్వాడ, బోయపల్లి, న వాబ్పేట, జడ్చర్ల, భూత్పూర్ కల్లు సొసైటీలు పెద్ద ఎత్తున ఈ కల్తీకల్లు దందాలు నిర్వహిస్తున్నాయి. కల్తీ కల్లు తయారీలో వాడే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న ఈగల్ ఫోర్స్ సిబ్బంది ఈ కల్లు సొసైటీలపై దాడులు చేయకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఏకంగా నకిలీ మత్త పదార్థాల కేంద్రం బయటపడడం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. గుట్టుగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ దందా వెనుక కొంతమంది నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే కల్తీ కల్లును తయారు కావాలంటే ఈ మత్తు పదార్థం కావాల్సింది. దీన్ని గుర్తుగా తయారు చేసి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఈ లెక్కన తయారు నిలువ ఉంచిన సీ హెచ్ విలువ కొన్ని రూ.కోట్లల్లో ఉండగా అధికారులు మాత్రం కేవలం రూ.20 లక్ష ల విలువ చేసే వా టిని మాత్రమే స్వాధీ నం చేసుకున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ మత్తు పదార్థం తయారీకి ఉపయోగించే మిషన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మత్తు పదార్థం కోసం చాలామంది అ డ్వాన్స్‌లు కూడా ఇచ్చి నట్లు ఆ డబ్బంతా ఈ తయారీ కేంద్రంలోనే ఉందని విశ్వసనీయ సమాచారం. మంత్రి ఫోన్ కాల్‌తో తారుమారైన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలను సరఫరా తయారీ కేంద్రంపై దాడికి దిగిన కొంతసేపటికే ఓ మంత్రి నుంచి ఫోన్ కాల్ రావడంతో అంతా సైలెంట్ అయిపోయారు. సదరు మంత్రికి సంబంధించిన కీలక వ్యక్తి ఒకరు దాడులు చేసిన అధికారులకు ఏం చేయాలి ఎలా చేయాలనే దానిపై డైరెక్షన్ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతేకాకుండా పట్టుబడిన డబ్బు మాయం చేయడం వెనుక కూడా సదరు కీలక వ్యక్తి హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. అసలు నిందితులను వదిలేసి నామమాత్రంగా కొంతమందిని అరెస్టు చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి అన్నాసాగర్ సమీపంలోని మత్తు పదార్థాల కేంద్రం వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
తాడూరు, జూలై 20 : నకిలీ 80 బస్తాల డీఏపీని పట్టుకున్న ఘటన తాడూరు మండలంలోని చోటు చేసుకున్నది. మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ తెలిపిన వివరాలిలా.. ఆకునెల్లికుదురులో ఒకరు ప్రభుత్వ అనుమతి లేని నకిలీ డీఏపీని అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. అతడి వద్ద ఉన్న 80 నకిలీ డీఏపీ బస్తాలతోపాటు పది మందికి అమ్మిన నకిలీ విత్తనాలు, 14 ఖాళీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ డీఏపీ అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సందీప్ తెలిపారు.