మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 7: చదువుతో పాటు క్రీడలో రాణించాలని పీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ కిశోర్ విద్యార్థులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ, చెన్నయ్‌లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొనే పీయూ జట్లు శనివారం తరలివెళ్లాయి.
ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ క్రీడాకారులను అభినందించి మాట్లాడుతూ టోర్నీలో ప్రతిభ చాటి జట్టు విజయానికి కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం క్రీడాకారులకు ట్రాక్‌సూట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యూజీ డైరక్టర్ చంద్రకిరణ్, పీడీ బాల్‌రాజ్‌గౌడ్, శ్రీనివాసులు, మొగులాల్, తదితరులు పాల్గొన్నారు.