కొల్లాపూర్ : అల్లూరి సీతారామరాజు (Alluri Seetharamaraju) భారత స్వాతంత్య్ర ఒక మహోజ్వల శక్తి అని అల్లూరి సీతారామరాజు యువజన స్వచ్చంద సేవ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు పి.సత్యనారాయణ, వెంకటయ్య అన్నారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలర్పించిన మహా యోధుడని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని వివరించారు. మన్యం ప్రజల్లో చైతన్యం తెచ్చి పోరాటం నేర్పించిన మహా శక్తి అల్లూరి సీతారామరాజని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ బాబు, సుధాకర్, పాషా, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.