మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబ ర్ 15 : గ్రూప్-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 154 కేం ద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రా ల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుం డా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్ సమావేశాలు నిర్వహించి డిపార్ట్మెంటల్ అధికారులు, జా యింట్ రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్, ఐడెంటిఫికేషన్ అధికారులు, పోలీసు నోడల్ అధికారులు, సిబ్బందిని నియమించారు.
పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్ష ఆదివారం రెండు విడుతలు, సోమవారం ఒక విడుత పరీక్ష ఉంటుంది. 8:30 నుంచి 9:30 గంటల వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 2:30గంటల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను సమయంలో మూసివేయాలని ఆదేశాలున్నాయి. అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో నమోదు చేయనున్నారు.
అభ్యర్థులు, కేంద్రాలు ఇలా..
మహబూబ్‌నగర్ జిల్లాలో 19,465 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, 52 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వనపర్తి జిల్లాలో 8,312 మంది అభ్యర్థులకు 31 కేంద్రాలు, నారాయణపేటలో 4,200 మందికి 13 కేంద్రాలు, నాగర్‌కర్నూల్‌లో 9,478 మంది అభ్యర్థులకు 33 కేంద్రాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 8,570 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 25 కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.
..? పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ఏ-4 సైజ్ పేపర్లో కలర్ ప్రింట్ తీసుకోవాలి.
..? హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్ ఫొటో అతికించాలి. డౌన్లోడ్ చేసిన హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా ముద్రించకుంటే సదరు అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుతున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్ అటెస్టేషన్తో మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతోపాటు వెబ్సైట్లో పొందుపర్చిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్‌కు అందించాలి.
..? షూస్ ధరించకూడదు, ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
..? భయం వీడి పరీక్షకు హాజరుకావాలి.