ఎర్రవల్లి చౌరస్తా, నవంబర్ 1 : ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీగార్లపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజేయుడు శుక్రవారం కర్నూల్లో లక్ష్మన్న ఆపరేషన్ నిమిత్తం మంజూరైన రూ.5లక్షల ఎల్వోసీని బాధితుడి కుటుం బసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.