మంచిర్యాల, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పీఠం దక్కించుకోడానికి కాంగ్రెస్ సర్కార్ చేసిన దౌర్జన్యాలు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, జైలు నుంచి బయటకు రాకుండా ఆయనపై ఉన్న పాత కేసులను తిరగదోడి పీడీ యాక్ట్ నమోదు చేయాలని చేసిన కుట్రలకు మంచిర్యాల జిల్లా కోర్టు శుక్రవారం చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో బాల్కసుమన్‌ను నాలుగు రోజు లు కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను జిల్లా కోర్టు రద్దుచేసింది. బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నా యకులపై పెట్టిన కేసు రాజ్యాంగ విరుద్ధమని, అరెస్టు చేసే సమయంలో సుప్రీంకోర్టు నిబంధనలు అనుసరించలేదని, పెట్టిన కేసుకు ఆయనను కస్టడీ కోరుతున్న అంశాలకు సంబంధమే లేదని బీఆర్ఎస్ లీగల్ సెల్, బాల్క సుమన్ తరఫున న్యాయవాదులు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.
బాల్క సుమన్‌ను కుటుంబసభ్యులు ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు న్యాయవాదులు తెలిపారు. కస్టడీ పిటిషన్ రద్దు, బెయిల్ పిటిషన్ వాయిదా అనంతరం బీఆర్ఎస్ లీగల్ సెల్, బాల్కసుమన్ తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ కక్షపూరితంగా ప్ర జాస్వామ్యాన్ని మభ్యపెట్టాలని ఎలాంటి చర్య తీసుకున్నా..
కోర్టులు అలాంటి చర్యలను అగణదొక్కుతాయని మరోసారి నిరూపితమైందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, ప్రభు త్వం బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రతి ఒక్క న్యాయవాది ఈ కేసులో మోరల్ సపోర్ట్ అందించారని పేర్కొన్నారు. పోలీసులు వేసిన పీటీ వారెంట్లను సైతం కోర్టు కొట్టివేసిందన్నారు.
కోర్టు మొట్టికాయలు వేశాకైనా తీరు మార్చుకోవాలి : దివాకర్‌రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే
బాల్క సుమన్ కేసులో కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు మొట్టికాయలు వేసిందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంచిర్యాల కోర్టుకు వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో బలమైన వాదనలు వినిపించిన మంచిర్యాల, హైదరాబాద్ లీగల్ టీమ్, కేసును గెలవడానికి అండగా నిలిచిన మంచిర్యాలలోని న్యాయవాదులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.