అయిజ, ఫిబ్రవరి 9 : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆ దివారం మండలంలోని కుటుకనూర్ గ్రామంలో రాజాపురం గుంటి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత, పీఏసీసీఎస్ మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలతో యువతలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు.
గ్రామీణ క్రీ డాకారులు, పట్ణణ ప్రాంత క్రీడాకారులతో పోటీ పడి జి ల్లా, రాష్ట్రస్థాయి క్రికెట్లో రాణించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సవాలను పురస్కరించుకుని రైతులు, యు వత ఆనందోత్సవాల నడుమ రైతు సంబురాలు, క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిన్న రాములు, బీఆర్ఎస్ నాయకులు బెంజిమెన్, ముక్తర్, బీందాస్, బందెనవాజ్, బ్రహ్మయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.