అయిజ, నవంబర్ 2 : చేపపిల్లల విడుదలతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చే సుకొని ఆర్థికంగా ఎదగాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అలంపూర్ మండలంలోని గొందిమల్ల సమీపంలో గల కృష్ణానదిలో మత్స్యశాఖ అధికారి షకీలాభానుతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో ని కృష్ణా, తుంగభద్ర నదులతోపాటు చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి దొ రుకుందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ చైర్మన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, గంగాధర్, మధుసూదన్‌రెడ్డి, తిప్పారెడ్డి, సర్దార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.