అయిజ, సెప్టెంబర్ 11 : మండలంలోని భూంపురంలో బుధవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భరోసా కల్పించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరామర్శించారు.
అంత్యక్రియల ఖర్చులకు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ రాముడు, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి రంగారెడ్డి, మాజీ సర్పంచ్ నీలకంఠరెడ్డి, నర్సింహారెడ్డి, గోవర్ధన్, భీందాస్ తదితరులు ఉన్నారు.
భూంపురం గ్రామంలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, నాయకుడు శివకుమార్ డిమాండ్ చేశారు.