గద్వాల, సెప్టెంబర్17 : జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసుహనుంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి మొదట స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ నాటి రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడితే విధిలేని పరిస్థితిలో నిజాంరాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారని తెలిపారు. బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హన్మంతునాయుడు మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో గద్వాలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చక్రధర్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, రాజారెడ్డి, సురేశ్‌శెట్టి, శేఖర్‌నాయుడు, చక్రధర్‌రెడ్డి, రాజు, శ్రీరాములు, అతికూర్ రహేమాన్, శ్రీనివాసులు, కోటేశ్, రాము తదితరులు పాల్గొన్నారు.