అయిజ, జూలై 25 : బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయిలో సత్తా చాటాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు క్రీడాకారులకు సూచించారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సహకారంతో శుక్రవారం మండలంలోని ఉత్తనూర్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పదో జూనియర్ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను టీబీఏ అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి, చైర్మన్ మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, దాత శ్రీనాథ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. తిరుమల్‌రెడ్డికి క్రీడలపై ఉన్న మక్కువతో బాస్కెట్‌బాల్ పోటీలను ప్రతి యేటా విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పోటీల నిర్వహణకు ముందుకు వచ్చిన టీబీఏ, ఆలయ కమిటీకి ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం టీబీఏ అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్, టీబీఏ, దాతల సహకారంతో కోర్టును అత్యాధునికంగా ముస్తాబు చేశామని పేర్కొన్నారు.
ఈ నెల 28 వరకు పోటీలు నిర్వహించనుండగా, వివిధ జిల్లాల నుంచి 33జట్లు తరలివచ్చాయన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా యూత్, స్పోర్ట్స్ ఇన్చార్జి జితేందర్, డీసీసీబీ కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, ఏసీజీఈ శ్రీనివాసులు, టీబీఏ ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రాముడు, మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, జీహెచ్ఎంలు తిమ్మారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, నిజామాబాద్ (బాలికల) జట్లు మొదటగా పోరుకు దిగాయి. ఈ పోరులో రంగారెడ్డి జట్టు, నిజామాబాద్‌పై 54-12 స్కోరుతో గెలుపొందింది. గజ్వేల్, జయశంకర్ భూ పాలపల్లి (బాలురు) 24-13, జగిత్యాల, హన్మకొం డ (బాలురు) 3-41, మే డ్చల్-మహబూబ్‌నగర్ (బాలికలు) 26-10, రం గారెడ్డి, మెదక్ (బాలురు) 56-24, హైదరాబాద్, మె దక్ (బాలికలు) 60-12, హై దరాబాద్, ములుగు (బాలురు) 68-8, మేడ్చల్, నిజామాబాద్ (బాలురు) జట్లు తలపడగా 60-33 స్కోరుతో గెలుపొందినట్లు టీబీ ఏ సెలక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు.