అర్హులందరికీ పథకాలు అందించాలి
నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించా రు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని పర్ధిపురం గ్రామంలో జరిగిన ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
- సమస్యల పరిష్కారానికి చర్యలు
- పర్ధ్దిపురంలో దరఖాస్తుల స్వీకరణ
]అయిజ, జనవరి 3 : నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించా రు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని పర్ధిపురం గ్రామంలో జరిగిన ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తుందని, అ ర్హులైన పేదలు దరఖాస్తులు అందించాలని కోరారు. ప్ర జా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటు లో ఉంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ యూత్ సభ్యు లు పర్ధిపురంను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అంద జేశారు. అలాగే మండలంలోని పులికల్‌లో నిర్వహించిన ప్రజాపాలనలో ఎంపీడీవో సాయిప్రకాశ్ దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దేవన్న, కమిషనర్ నిత్యానంద్, సర్పంచ్ గోవర్ధనమ్మ, ఎంపీవో నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు, అధికారు లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజాపాలన పరిశీలన..
మానవపాడు, జనవరి 3 : అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం మానవపాడులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకోవడానికి వ చ్చిన ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. దరఖాస్తులు సరిపోయినన్ని ఉన్నాయా లేదా అని ఎం పీడీవోను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు భారీగా రావడంతో ఎమ్మెల్యే విజయుడు అందరి దరఖాస్తులు స్వీకరిస్తారని సంయమనం పాటించాలన్నారు. కొత్త రేషన్‌కార్డు కోసం తెల్ల పేపర్ మీద రాసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా మానవపాడులో 1,338, చెన్నిపాడులో 254 దరఖాస్తులు స్వీకరించినట్లు జెడ్పీ సీఈవో, మం డల ప్రత్యేకాధికారి నాగేంద్రం తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

