అలంపూర్, ఫిబ్రవరి 11 : అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అర్చకులు విశేష పూజలు ని ర్వహించారు. చండీహోమాలు, పవమాన సూక్త పారాయణ హోమాలు, మండపారాధన, బలిహరణ ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవాలకు భక్తు లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజా మున నుంచే అమ్మవారిని దర్శించుకొని తన్మయ త్వం చెందారు. జోగుళాంబ యాగశాలలో చండీహోమాలు కొనసాగాయి. అమ్మవారి ఆలయం లో కుంకుమార్చన, ఖడ్గమాల, త్రిశతి అర్చన వం టి తదితర పూజలు చేపట్టారు.