భూత్పూర్, అక్టోబర్ 13 : అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. తన సొంత గ్రామమైన అన్నాసాగర్‌లో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దసరా ఉత్సవాల్లో పాల్గొని శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆలను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 13 : అడ్డాకులకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణరెడ్డి చిత్రపటానికి దేవరక ద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆ దివారం నివాళులర్పించారు. అతడి కుమారులు చంద్రమోహన్‌రెడ్డి, సూర్యమోహన్రెడ్డిలను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, సింగిల్విం డో చైర్మన్ జితేందర్‌రెడ్డి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహెమూద్, మాజీ ఎంపీటీసీ రంగన్నగౌడ్, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి పాల్గొన్నారు.