వనపర్తి, ఫిబ్రవరి 26 : కష్టపడితే ఏదైనా సాధ్యమే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మనిషి చేసే శ్రమలోనే దేవుడు ఉన్నాడన్నారు. రేవల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 60 మంది ఆదివారం వెంకటరమణ, దానేలు, రాజు, కుర్మయ్య , మధు, రాములు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన కార్యక్రమం లో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకన్నా జీవిత అనుభవాలు చాలా గొప్పవని చెప్పారు. కష్టం చేసే ధైర్యం, నమ్మకం ఉంటే మనిషి ఎక్కడైనా జీవించగలడని తెలిపారు. ప్రపంచంలో ఉచితంగా ఏదీ రాదని, కష్టం చేసుకుని ఏదైనా సంసాదించుకోగలమనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని కోరా రు.
తెలంగాణలో అమలవుతున్న ఆదర్శ పథకాలను దేశవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని స్పష్టం చేశారు. గులాబీ పార్టీని మ రింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులు అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే సాయంత్రం వనపర్తిలో గోపాల్‌పేటకు చెందిన వివిధ పార్టీల నాయకులు 25మంది మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, మాజీ ఎంపీటీసీ రాజు, నాయకుడు సాయిరాం తదితరులు పాల్గొన్నారు.