వనపర్తి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నేడు గ్రామాలన్నీ శుభ్రంగా.. సుందరంగా.. ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి సాధించాయన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. వనపర్తి జిల్లా చీమనగుంటపల్లిలో శుక్రవారం రాత్రి మంత్రి పల్లెనిద్ర ముగించుకుని శనివారం ఉదయం గ్రామంలోని దళితవాడలో ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకొని మాట్లాడారు. అడుగడుగునా అభివృద్ధి, గడప గడపకూ సంక్షేమం విలసిల్లుతున్నదని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపునకు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు నిదర్శనమన్నారు. ప్రజలకు మౌలిక వసతులు, సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో సౌకర్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. మిషన్‌భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ శుద్ధినీరు అందుతున్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనతో పల్లె, పట్టణం తేడా లేకుండా అభివృద్ధి పథకంలో పయనిస్తున్నాయని వెల్లడించారు.
దీంతో పట్టణాలకు వలస లు తగ్గి గ్రామాలకు వలసలు మొదలయ్యాయని తెలిపా రు. చెరువులు, కుంటల మరమ్మతు, సాగునీరు పుష్క లం కావడంతో భూగర్భజలాలు పెరిగాయన్నారు. నల్ల చెరువు, అమ్మచెరువు, తాళ్ల చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా నిర్మించినట్లు వివరించారు. మురుగుతో దుర్భరంగా ఉన్న చెరువులు కృష్ణానీటితో నేడు జలకళను సంతరించుకున్నాయన్నారు. రహదారుల విస్తరణ పను లు పూర్తయితే వనపర్తి మోడల్ పట్టణంగా నిలవనున్నదన్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి పనులు ముం దుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
పల్లెనిద్రలతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 47 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు, అలాగే కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలతో ప్రజలకు ప్రభుత్వం చేరువైందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా, పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అందరికీ అందజేస్తామని తెలిపారు. అనంతరం వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేసి నగదును అందజేశారు. ప్రమాదవశాత్తు భర్తలు, కొడుకులు మరణించిన కుటుంబాలను పరామర్శించి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న వారి కుటుంబాలకు బీమా కింద రూ.2 లక్షలు అందజేస్తామన్నారు.
రైతుబీమా కింద రూ.5 లక్షలు అందుతాయని భరోసానిచ్చారు. పింఛన్ మంజూరు చేయించి పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా కొంత సాయం అందజేశారు. అలాగే వనపర్తి మున్సిపాలిటీలో మంత్రి పర్యటించారు. నల్ల చెరువుపై రూ. 1.15 కోట్లతో, వశ్యాతండాలో రూ.84 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, మెట్పల్లిలో రూ.45 లక్షలతో నిర్మించే సీసీ, డ్రైయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజనగరం అమ్మచెరువు పనులను పరిశీలించారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రావు, తాసిల్దార్ రాజేందర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్‌కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, విండో వైస్‌చైర్మన్ రఘువర్ధన్‌రెడ్డి, సర్పంచులు గౌడ నాయక్, రాజేశ్వరమ్మ, మాధవరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహ, ఎస్సీ సెల్ నేత కోళ్ల వెంకటేశ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము, కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.