‘నాడు కరువు తాండవిస్తున్న సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు గ్రామాల్లో గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు.. నేడు తెలంగాణలో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయి’. అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి పెబ్బేరు మండలం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై రైతుబంధు ప్రకటించి ఐదేండ్లు పూర్తి కావడంతో కేక్ కట్ చేసి శ్రేణులతో కలిసి ఆనందం పంచుకున్నారు. అలాగే 9 ఏండ్లలో వనపర్తి నియోజక వర్గ అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. అనంతరం మాట్లాడుతూ పురోగతి దిశగా వ్యవసాయ రంగం అడుగులు వేస్తున్నదని చెప్పారు. సాగునీటి రాకతో సిరుల పంటలు పండుతున్నాయని, దీంతో ఉమ్మడి జిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారిపోయిందని వివరించారు. ఇకపై గ్రామాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాల పండుగను నిర్వహిస్తామని తెలిపారు. గులాబీ పార్టీశ్రేణులు కుటుంబ సమేతంగా రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
పెబ్బేరు, మే 10 : ‘ఒకప్పుడు పాలమూరు జిల్లాలో పేదరికం, కరువు కనిపించేది.. తిండిలేక జనం వలస వెళ్తే గ్రామాల్లో ఉన్న వారి ఆకలి తీర్చేందుకు గంజి కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ, తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లా ముఖచిత్రం మారిపోయింది. వ్యవసాయ రంగం ఊహించని విధంగా అభివృద్ధి సాధించింది. గంజి కేంద్రాల స్థానంలో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయి’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని వల్లపురెడ్డి ఫంక్షన్హాల్లో బుధవారం పెబ్బేరు, శ్రీరంగాపురం బీఆర్ఎస్ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రకటించి ఐదేండ్లు పూర్తి అయినందున కార్యకర్తలతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. తొమ్మిదేండ్లల్లో వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంతో పురోగతి సాధించిందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడంతో తెలంగాణ రాష్ట్ర దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు వనపర్తి నియోజకవర్గంలో ఎన్నో సాగునీటి పథకాల ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరందించామన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఎకరా జాగా కూడా ఖాళీగా కనిపించదని, పచ్చదనం పరుచుకున్నదన్నారు. మం డల స్థాయి బీఆర్ఎస్ సమ్మేళనాల మాదిరిగా.. త్వరలో ప్రతి గ్రామంలో నూ ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీలో అందరినీ కలుపుకోవాలని, ప్రతి గ్రామంలో గతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. అతి విశ్వాసం వీడి.. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్నారు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ వెనుకడుగు వేయొద్దని, పార్టీ పటిష్టతకు ని రంతరం శ్రమించాలన్నారు. మన మాటలు, చేతల ద్వా రా ఓట్లు పెరగాలని, ప్రతిపక్ష పార్టీ ఓట్లను పూర్తిగా కొల్లగొట్టాలని సూచించారు. దశాబ్దాలుగా జరగని అభివృద్ధి కే వలం తొమ్మిదేండ్లలోనే జరిగిందని, అది చూసి జీర్ణించుకోలేక కేసీఆర్‌ను తిడితే ఓట్లు పడతాయనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. ప్రతి కార్యకర్త ప్రణాళికాబద్ధంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీలు శైలజ, గాయత్రి, జెడ్పీటీసీ పద్మ, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ స్వామి, నాయకులు బుచ్చారెడ్డి, రా ములు, దిలీప్‌రెడ్డి, పృథ్వీరాజ్, గౌడానాయక్ తదితరులున్నారు.