వనపర్తి, ఫిబ్రవరి 13: యాసంగి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సంబంధిత అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పా లమూరు మార్కెట్లకు యాసంగి పంటల రాక, సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులపై మంత్రి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా ర్కెట్లకు వేరుశనగ పెద్దఎత్తున వస్తున్నదని, అక్కడికి వచ్చే రైతులకు అసౌకర్యం కలుగొద్దని, కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలని సూచించారు.
వనపర్తి మార్కెట్లో రైతులకు హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5కే భోజనం ఏర్పాటు చేయాలని 10రోజుల్లో దీనికి సంబంధించిన చర్యలను తీసుకోవాలన్నారు. ప్రతి యాసంగిలో జనవరి నుంచి మార్చి వరకు పంటలు మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో రైతులకు భోజన సౌకర్యం అందుబాటులో ఉంచాలన్నారు. గద్వాల సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, వనపర్తి సమీకృత మార్కెట్ పనులను మార్చి నెలాఖరు వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిభాయి, అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, ఎస్ఈ రాధాకృష్ణమూర్తి, జేడీ ఇఫ్త్తేకార్ అహ్మద్, డీడీ పద్మహర్ష తదితరులు పాల్గొన్నారు.