వనపర్తి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతుల్లో అయోమయం.. గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2లక్షల వరకు లోన్లు మాఫీ చేశామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ పలు ప్రాంతాల్లో వివిధ కారణాలతో ఇంకా చాలా మందికి వర్తించకపోవడంతో కర్షకులకు ఎదురుచూపు తప్పడం లేదు. అర్హత ఉండి మాఫీ కాని రైతులు పలుచోట్ల ఆందోళనలు కూడా చేపట్టారు. మాకెందుకు మాఫీ చేయరం టూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకే కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు రుణమాఫీ రణరంగా న్ని తలపిస్తుంది.
ఈ పరిణామాలతో స్పందంచిన ప్రభుత్వం రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భా గంగా ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు గ్రామ స్థాయిలో సభలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కార్యాలయా లు, రైతు వేదికల్లోనూ నిర్ధారణ ప్రక్రియలకు చెందిన వివరాల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇది లా ఉంటే, వనపర్తి జిల్లాలో తొలివిడుతలో 27, 066 మందికి రూ.145.55 కోట్లు, రెండో విడుతలో 16,527 మందికిగానూ రూ.154.58 కోట్లు, మూడో విడుతలో 10,047 మందికి రూ.126.62 కోట్లు మాఫీ అయ్యాయి. ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా 53,640 మంది రైతులకుగానూ రూ.426.76 కోట్లు ఇప్పటి వరకు మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. రేషన్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేని వారికి రుణమాఫీ ఆర్థిక సా యం అందలేదు. జిల్లాలో 8,127 మంది రైతులకు సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో ఏవో,ఏఈవోలు గ్రామాలు తిరుగుతూ ఇప్పటివరకు 6,180 మంది కర్షకులను సంప్రదించి సమాచారాన్ని నమో దు చేశారు. ఇంకా దాదాపు 2 వేల మంది రైతులు పెండింగ్‌లో ఉన్నారు.
రుణమాఫీ కానివారి వివరాలు సేకరించేందుకు అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. అక్కడే రైతు కుటుంబం వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చారు. వ్యవసాయ అధికారులు, ఏఈవోలు కుస్తీ పడుతున్నా.. ఇంకా దాదాపు జిల్లాలోని 14 మండలాల్లో నమోదు ప్రక్రియ పెండింగ్‌లోనే చూపుతుంది. ముందస్తుగా ప్రకటించిన గడు వు ఎప్పుడో ముగిసింది. అయినా ఇంకా నమోదు ప్రక్రియ సాగుతూనే ఉన్నది.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు కుటుంబాల నిర్ధారణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏడీఏలు, ఏవో, ఏఈవోలు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. సమయానికి అందుబాటులో లేని రైతులు కార్యాలయానికి వచ్చి వివరాలు తెలియజేసేలా అవకాశం కల్పిం చాం. ఇతర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న వారి వివరాల నమోదు కొంత ఇ బ్బందిగా మారింది. పెండింగ్‌లో ఉన్న రైతుల వివరాల నమోదును త్వరలోనే పూర్తి చేయిస్తాం.
– గోవింద్‌నాయక్, డీఏవో, వనపర్తి