వెల్దండ, మార్చి 20 : వెల్దండ మండలం గుండాలకు చెందిన పర్వత్‌రెడ్డి పవనపుత్ర హెచ్‌పీ పెట్రోల్ బం కులో బుధవారం సాయంత్రం రూ.200ల పెట్రోల్ పోయించుకొని కొంత దూరం వెళ్లేసరికే బైక్ ఆ గిపోయింది. పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న మెకానిక్ షా పులో బైక్ రిపేరుకు ఇవ్వగా, రెండు లీటర్ల పెట్రోల్ పోయించగా, లీటరు వరకు నీళ్లు ఉన్నట్లు గు ర్తించారు.
దీంతో వాహనాదారుడు నీళ్లు కలిసిన పె ట్రోల్ బాటిల్‌తో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చే శాడు. పోలీసులు సంబంధిత శాఖ అధికారులకు స మాచారం ఇవ్వడంతో జిల్లా సివిల్ సప్లయ్ అసిస్టెంట్ హైదర్ అలీ, డీటీ దీపిక పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. పెట్రోల్‌ను టెస్టింగ్‌కు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.