ఊట్కూర్ : వలసల జిల్లాగా పేరుగాంచిన నారాయణపేట జిల్లా నుంచి విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని బీజ్వారం అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ ( Aditya Parashri Swamiji ) అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామ అడవుల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో రాయికోడ్ గ్రామానికి చెందిన టీ అనూష 10 కి.మీ మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొని సిల్వర్ మెడల్ దక్కించుకుంది. మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామానికి చెందిన ఆర్ స్వప్న ఢిల్లీలో జరిగిన ఏషియన్ షూటింగ్ బాల్( Shooting Ball ) క్రీడల్లో కాంష్య పథకం సాధించింది. రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులు సాయి కీర్తన, అజయ్‌ను శనివారం స్వామిజీ శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో సైక్లింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, విశ్రాంత పీఈటీ బీ గోపాలం, జిల్లా షూటింగ్ బాల్ కార్యదర్శి రమేష్ కుమార్, గోపి గౌడ్, అనిల్ పాల్గొన్నారు.