గద్వాల, డిసెంబర్ 11 : కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నడిగడ్డ విద్యలో వెనుకబడిపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను గాడిలో పెట్టింది. వి ద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా కృషి చేసింది. మళ్లా రేవంత్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి నడిగడ్డ ఉన్నత విద్యలో వెనుకబడిపోయే ప్రమా దం దాపురించింది. జిల్లాలో ఉన్న ప్రభుత్వ కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ లేక పోవడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. కొ న్ని కళాశాలల్లో అధ్యాపకుల పె త్తనం కొనసాగుతుండడంతో తోటి అధ్యాపకులు పని చేయలేని పరిస్థితి నె లకొన్నది.
వ్యవస్థను చక్కదిద్దాల్సిన అధికారే తానే అన్నింటికి ము ందు ఉండడంతో సీనియర్ లెక్చరర్లు ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఆయన్ను ఎవరైనా ప్రశ్నిస్తే మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటికి పెద్ద దిక్కులేకపోతే కుటుంబం ఎలా అస్తవ్యస్తంగా తయారవుతుందో అందరికీ తెలిసిందే. కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో విద్యార్థులకు సరైన విద్యాబోధన జరగకపోవడంతో రోజురోజుకూ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండ ల కేంద్రంలో ఉన్న కళాశాల ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడేది. ప్రస్తుతం ఈ కళాశాలలో మొదటి సంవత్సరం వందలోపు విద్యార్థులు ఉన్నారంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది.
ఇంటర్ జిల్లా అధికారికే మూడు బాధ్యతలు
ఇంటర్మీడియట్ జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి ఆ విధులతోపాటు ధరూర్, గట్టు కళాశాలల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నో డల్ అధికారి బాధ్యతలు ఎప్పుడు నిర్వహిస్తాడు.. ధరూర్, గట్టు కళాశాలల ప్రిన్సిపాళ్లుగా ఎలా విధులు నిర్వర్తిస్తాడో అర్థం కాని పరిస్థితి. గట్టులో ఈ మధ్య నే రెగ్యులర్ అయిన అధ్యాపకుడు అక్కడ పెత్తనం చెలాయిస్తుండడంతో మిగతా అధ్యాపకులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు బాధ్యతలు నోడల్ అధికారే నిర్వహిస్తుండడంతో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో న్యా యం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పజెప్పాలని ఉన్నా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాస్తవంగా ఏ కళాశాలలో అయితే ప్రిన్సిపాల్ స్థానం ఖాళీ ఉన్నదో.. ఆ కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా ఉన్న వారికి ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించాలి. కానీ ఇక్కడి జిల్లా అధికారి అవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్స్‌ల కోసం సీనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక్కో ప్రిన్సిపాల్‌కు అదనపు బాధ్యతలు
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాళ్లకు అదనంగా మరో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బాధ్యతలతోపాటు ధరూర్, గట్టు కళాశాలలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అదనంగా మల్దకల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మానవపాడు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అదనంగా అలంపూర్ జూనియర్ కళాశాల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒక్కో ప్రిన్సిపాల్ అదనంగా ఇతర కళాశాలల ప్రిన్సిపాల్స్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎక్కడా సక్రమంగా విధులు నిర్వహించలేక పోతున్నట్లు తెలిసింది.
కలెక్టరేట్లో నోడల్ కార్యాలయం బోర్డు..విధులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో..
నూతన కలెక్టరేట్ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్లోని సముదాయాల్లోకి మార్చారు. అయితే ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని కూడా కలెక్టరేట్‌లోకి మార్చారు.. అయితే పేరు మా త్రం అక్కడ.. విధులు మాత్రం జూనియర్ కళాశాలలో ఓ గదిలో నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది ఎవరు.. ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నా రో.. తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇంటర్మీడియట్ జిల్లా కార్యాలయాన్ని కలెక్టరేట్‌లోకి మార్చితే అధికారులు అందరూ సక్రమంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాల్సి ఉన్న ది. ఇప్పటికైనా ఇంటర్‌బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాళ్లను నియమించి వి ద్యావ్యవస్థను బలోపేతం చేయాలని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.