నారాయణపేట టౌన్, డిసెంబర్ 30 : కుష్టువ్యాధి రోగులకు వైద్య సిబ్బంది అందించే సేవలు ఎంతో గొప్పవని అదనపు కలెక్టర్ మియాంక్ మి ట్టల్ అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పదహారు మంది కుష్టువ్యాధి రోగులకు ఒ క నెల సరిపడే పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని పట్టణంలోని జిల్లా దవాఖానలో శుక్రవా రం నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. సమాజంలో కుష్టువ్యాధి రోగులను గుర్తించే ప్రక్రియ, వారిని దవాఖాన వరకు తీసుకొచ్చి, మంచి మందులతో వైద్యం అం దించే మూడు పద్ధతుల్లో సేవలు అందించే ఫీల్డ్ సి బ్బంది, వైద్యులు పాత్ర గొప్పదన్నారు. రోగులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ ఎనిమిది రకాల ఆహారపు కిట్లను అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు.
డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు మాట్లాడు తూ గతంలో మాదిరిగా కాకుండా కుష్టు వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ అందరితో కలిసి మెలి సి ఉండవచ్చనన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కె. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ దాతల సహాయంతో కుష్టు వ్యాధిగ్రస్తులకు కిట్లను అందించడం జరుగతుందన్నారు. రూ.900ల విలువ చేసే కిట్‌లో ఎనిమిది రకాల వస్తువులు ఉంటాయన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రంజిత్‌కుమార్, డాక్టర్లు పావని, బా లాజీ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు జయంత్‌రెడ్డి, సుభాష్, టీబీ ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు తది తరులు పాల్గొన్నారు.