కృష్ణ/మాగనూర్, నవంబర్ 10 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని పీఏసీసీఎస్ సిబ్బందికి నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్‌షాలం సూచించారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘కానరాని కేంద్రాలు’ కథనానికి అధికారులు స్పందించారు. నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్‌షాలం, సివిల్ సైప్లె డీఎం దేవదాస్, డీఎస్వో సుదర్శన్ కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు రోజుల్లో రైస్‌మిల్లులు ట్యాగ్ అవుతాయని, రైతులకు గన్నీ బ్యాగులిచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని సిబ్బంది, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డికి సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. కొనుగోలు చేసేందుకు స్థలం సరిపోవడం లేదని, ప్రత్యామ్నాయం ఆలోచించాలని రైతులు అదనపు కలెక్టర్‌కు చెప్పడంతో.. సిబ్బందితో మాట్లాడి ఆలోచిస్తానన్నా రు. అలాగే మాయిశ్చర్ చూసే విధానంలో ఇబ్బందులు కలగొద్దన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.