Achampet | బల్మూర్: కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కుంట గ్రామ శివారులో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అర్హుల నుంచి డబ్బులు వసూలు చేస్తే పార్టీ, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల కోసం నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలోనూ నిజమైన పేదలకు అర్హులకు గుర్తించి వారికి ఇళ్లను ఇవ్వాలని సూచించారు. గ్రామాలలో నాయకులు, కార్యకర్తల మధ్యలో ఉన్న మనస్పర్ధలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరు పనిచేయాలని సూచించారు. గ్రామాలలో పథకాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో నాయకులు గిరి వర్ధన్ గౌడ్, కాశన్న యాదవ్, సుధాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్, మాసన్న, పద్మమ్మ, రాధాకృష్ణ, రాంప్రసాద్ గౌడ్, చందు, సైదులు, ఖదీర్, శివ గౌడ్, ఎల్లస్వామి, మహమ్మద్, దశరథం, కృష్ణయ్య కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.