కల్వకుర్తి, ఏప్రిల్ 1 : ఊర్కొండపేట లైంగిక దాడి ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళపై దాడికి పాల్పడ్డ వారి రూటే సపరేటు. గుడికి వచ్చిన జంటలను టా ర్గెట్ చేస్తూ.. వారు ఏకాంతంగా ఉన్న ఫొటోలను తీసి బ్లాక్ మెయిలింగ్ చేయడం, బెదిరించి డబ్బు వసూలు చేయడం, నగలు ఏవైనా ఉంటే లాక్కోవడం వంటి పనులకు పాల్పడేవారని గ్రా మస్తుల నుంచి కొత్త విషయాలు వినిపిస్తున్నా యి. ఎవరికైనా చెబితే.. ఫొటోలను మీ కుటంబ సభ్యులకు చేరవేయడమో లేదా సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించేవారట. మం గళవారం పోలీస్ ఉన్నతాధికారుల ఘటనా స్థలాన్ని పరిశీలించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుల గురించి వారి క్రైం రికార్డును పరిశీలిస్తున్నామని చెప్పడం చూస్తుంటే.. గ్రామస్తుల అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి దే వాలయం ఊర్కొండ మండల కేంద్రానికి ఊ ర్కొండపేట గ్రామానికి మధ్యలో ఉన్నది. గుడి, గుడి ఎదురుగా, పక్కన పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అభయాంజనేయస్వామి ఆల యం శక్తిస్థలంగా ప్రసిద్ధి చెందడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. గుడిలో ప్రతిరోజూ సత్య నారాయణస్వా మి వ్రతాలు జరుగుతుంటాయి. మంగళ, శనివారాల్లో భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. రా త్రి వేళల్లో భజనలు జరుగుతుంటాయి. గుడి, పక్కన గుట్టలు ఉండడంతో ఏకాంతం కోరుకునే ప్రేమికులు, కొత్త జంటలు గుట్టలపైకి సహజంగానే వెళ్తుంటారు. ఏకాంతగా కనిపించిన జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఫొ టోలు తీసి బ్లాక్మెయిల్ చేసే వారని గ్రామస్తు లు చెబుతున్నారు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి, బె దిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేసే గ్రూపులు ఐదారు వరకు ఉన్నాయని గ్రామస్తు లు చెబుతున్నారు.
లైంగిక దాడి ఘటనలో ఉ న్న నిందితులకు క్రిమినల్ లా, పోక్సో వంటి చట్టాలపై అవగాహన ఉందని ఐజీ సత్యనారాయణ వెల్లడించడం చూస్తే.. గ త రెండు మూడేండ్ల నుంచి నిందితులు జల్సాలకు అలవా టు పడి దేవుడి సన్నిధికి వచ్చిన భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం అలవాటుగా మారిందని గ్రామస్తులు అంటున్నా రు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మరిం త ధైర్యంగా రెచ్చిపోయారని తెలుస్తున్నది. క్రిమినల్ లా, పోక్సో వంటి చట్టాలపై అవగాహన ఉం డడంతో మైనర్ల జోలికి వెళ్లకుండా, కేవలం భ యపెట్టి డబ్బులు వసూలు చేయడం, నగలు గుంజుకోవడం వంటి పనులు చేశారని ఐజీ చె ప్పారు. తెలివిగా ఆలోచిస్తూ వివాహితలను టార్గెట్ చేశారని తమ దర్యాప్తులో తెలిందని ఐజీ చెప్పారు. లైంగికదాడి విషయంలో పూర్తిస్థాయి లో విచారణ జరుపుతున్నాయని, తప్పు చేసింది ఎవరైనా కఠినంగా శిక్షస్తామని ఆయన పేర్కొన్నా రు. పూర్తి విచారణలో భాగంగా దేవాలయానికి వచ్చే భక్తులను బెదిరించి డబ్బులు వసూలు, బ్లాక్మెయిలింగ్ చేసి, నగలు లాక్కున్న వారి మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశమున్నదని గ్రామస్తులు అంటున్నారు.