వనపర్తి, జూలై 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మే ధావుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రైతు భ రోసాపై ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చె ప్పారు. ఇప్పటికే వచ్చే నెలలో రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని, ఇందుకు నిధు ల సమీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నదన్నారు. శుక్రవారం రైతు భరోసాపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతుల అభిప్రాయ సేకరణ కోసం వనపర్తి జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీ నివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవితోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా మం త్రులను స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ వ్యవసా యం చేస్తున్న ప్రతిరైతుకు రైతు భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో జరిగిన లో పాలను సవరిస్తూ సరైన పద్ధతిలో పథకాన్ని అమలు చేయడంలో భాగంగానే రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. సన్న, చిన్నకారు రైతులకు ప్రభు త్వం చేయూతనిస్తున్నదని, రైతులకు మేలు జరిగే విధంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ అభిప్రాయాల సేకరణ అనంతరం అసెంబ్లీలోనూ చర్చించి రైతు భరోసాపై ఓ నిర్ణయానికి రావడం జరుతుందని తుమ్మల పేర్కొన్నారు.
రైతుబంధు పథకం ద్వారా గతంలో జరిగిన దు ర్వినియోగాన్ని నివారించడం కోసమే రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేవలం వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలన్నదే లక్ష్యమని, పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చే పరిహారమంతా ప్రజల నుంచి వచ్చిందే ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఓపెన్ డిబెట్ ద్వారా రైతుల అభిప్రాయ సేకరణ కొనసాగుతుందన్నారు. రైతు భరోసాపై ఇప్పటికే నిర్ణయం జరిగిందని చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మొద్దన్నారు. అసెంబ్లీ ఏర్పాటు జరిగేలోపు ఈ కార్యక్రమాలను ముగిస్తామని పొంగులేటి చెప్పారు.
రైతు భరోసా పథకంలో ప్రతిదీ లెక్క ప్రకారమే జరగాలన్న లక్ష్యంతోనే రైతు అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి జూపల్లి కృష్ణా రావు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా నష్టం జరగడానికి వీలు లేకుండా చర్యలుంటాయన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను మళ్లీ జరగకుం డా తగిన చర్యలు తీసుకోవడం జరుతుందన్నా రు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమ లు చేసే దిశగా ప్రభు త్వం అడుగులు వేస్తున్నదని మంత్రి వెల్లడించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పథకాన్ని 12 దఫాలుగా ఆర్థిక సాయం అందించిందని, తన కు 80 ఎకరాల వ్యవసాయ పొలం ఉందని, తాను ఒక్క రూపాయి కూడా రైతుబంధు ద్వారా తీసుకోలేదని చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికశా తం రైతులు 10ఎకరాలలోపు ఉన్న వారే 90 శాతానికిపైగా ఉన్నారన్నారు. నిరుపేద, మధ్యతరగతి రై తులకు ఇబ్బందులు లేకుండా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు అభిప్రాయలు సేకరిస్తున్నదని వివరించారు. సమావేశంలో రైతులు అధికశాతం పదెకరాల వరకు రైతు భరోసాను అమలు చే యాలని కోరారు. సమావేశానికి ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, వాకిటి శ్రీధర్, పర్ణికారె డ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్లు విజయేంద్రబోయి, సంతోష్ బదావత్, సంచిత్ గంగ్వార్, సి క్తా పట్నాయక్, బీఎం సంతోష్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.