లింగాల, ఆగస్టు 18 : అటవీ శాఖ క్షేత్ర కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఇద్దరు అటవీశాఖ అధికారులపై కేసునమోదు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం జూలై 23వ తేదీన లిం గాల మండలంలోని రాయవరం గ్రామ సమీపం లో నల్లమల అట వీ ప్రాంతం నుం చి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి మూడు బండ్లలో వ్యవసా య పనిముట్లకు సం బంధించిన కలపను తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ సెక్షన్ అధికారి రాంబాబు, ఫారెస్టు బీట్ అధికారి మురళీకృష్ణ వారిని పట్టుకొని రూ.1.20లక్షలకు బేరసారాలు చేసి డిమాండ్ చేయగా అంత డబ్బులు మా వద్ద లేదని రూ.50వేలు ఇచ్చినట్లు తెలిపారు.
తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులకు రసీదులు ఇవ్వమని అడగడానికి వెళ్తే మళ్లీ ఇద్దరు అటవీశాఖ అధికారులు రూ.50వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో లింగాల అటవీశాఖ కార్యాలయంలో గంట సేపు సోదాలు నిర్వహిం చి పలు రికార్డులను పరిశీలించగా రూ.50వేలు లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరు ఫారెస్టు అధికారులపై కేసునమోదు చేసి హైదరాబాద్ ఏసీబీ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.