ఊట్కూర్, జూన్ 14 : దాయాదుల మధ్య మొదలైన భూ తగాదాల్లో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్ద రు భార్యలు. మొదటి భార్య సంతానం ఎర్రగండ్ల సంజ ప్ప కాగా రెండో భార్య సంతానం పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప. కాగా లక్ష్మప్ప తర పేరున ఉన్న తొమ్మిదెకరాల పొలాన్ని ముగ్గురు కుమారులకు రాసిచ్చాడు. కాగా మొదటి భార్య కొడుకైన సంజప్ప కొన్నేండ్ల కిం దటే చనిపోగా అతడి కుమారులు భూ పంపకాలను వ్య తిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో కొన్నాళ్లుగా పొలం కోసం ఘర్షణ పడుతున్నారు. ఇదే విషయమై పలుమార్లు పరస్పర దాడులతో పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. కాగా గురువారం పెద్ద సవారప్ప, అతని కుమారుడు సంజీవ్ (28), సోదరు డు చిన్న సవారప్ప, మరదలు కవిత తమ పేరిట ఉన్న పొలంలో విత్తనాలు వేసేందుకు వెళ్లారు. ఈక్రమంలో వారి దాయాదులైన ఆశప్ప, గుట్టప్ప, చిన్న వెంకటప్ప, ఆటో సంజీవ్, శ్రీను, కిష్టప్ప, నట్టలప్పతో పాటు మరికొందరు రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను స్థానిక మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, అతని అనుచరులు నారాయణపేట జిల్లా దవాఖానకు అటు నుంచి మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడిపై జరుగుతున్న దాడిని అతడి సోదరి సెల్‌ఫోన్ సహాయంతో వీడి యో తీసింది. మృతుడికి భార్య అనిత, పిల్లలు సాత్విక్, వంశీ ఉన్నారు. సంజీవ్ మృతి తో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా మక్తల్ సీఐ చంద్రశేఖర్ గ్రామాన్ని సందర్శించి పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు.
చిన్నపొర్లలో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణపై బాధిత కుటుంబం, స్థానికులు 100కు సమాచారమిచ్చినా ఎస్సై శ్రీనివాసులు స్పందించలేదని.. ఫలితంగా సంజీవ్ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. ఘటన మధ్యాహ్నం 1:30గంటలకు జరిగితే పోలీసులు రెండు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే ఘోరం జరిగిందన్నారు. ఘటన విషయాన్ని చెప్పేందుకు వెళ్లగా ఆ సమయంలో ఠానాలోనే ఉన్న ఎస్సై శ్రీనివాసులు తన పై పరుష పదజాలంతో చిందులు వేసినట్లు పెద్దజట్రం గ్రామానికి చెందిన ఓ దళిత ప్రజాప్రతినిధి తెలిపారు.
దాయాదుల దాడిలో గాయపడి మృతి చెందిన సంజీ వ్ బీజేపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కార్యక్రమా ల్లో చురుగ్గా పాల్గొనేవాడు. పొలంలో విత్తనాలు నాటాలని.. దాయాదుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కుటుంబసభ్యులతో కలిసి పదిరోజుల కిందటే పోలీసులను ఆశ్రయించాడు. ఇదే విషయమై రెండ్రోజు ల కింద మక్తల్ సీఐని సంప్రదించామన్నారు. సీఐ ఆదేశాలతో ట్రాక్టర్‌తో పొలానికి వెళ్లిన తమ కుమారుడిని అకారణంగా పొట్టన పెట్టుకున్నట్లు సంజీవ్ తల్లిదండ్రు లు ఆరోపిస్తున్నారు. నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెంది న వారు కావడంతోనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించులేదన్నారు.
ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఓ వర్గానికి చెందిన ఆటో సంజప్ప, చిన్న వెంకటప్ప, గుట్టప్ప, ఆశప్ప, శ్రీను, కిష్టప్ప, నట్టలప్పపై కేసు నమోదు చేశామని, నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. డయల్ 100కు సమాచారమివ్వగానే పోలీసులను పంపించి గాయడిన వ్యక్తిని అంబులెన్స్‌లో దవాఖానకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
పోస్టుమార్టం అనంతరం సంజీవ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం పోలీసులు శుక్రవారం సాయంత్రం అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా గ్రామస్తులు బాధిత కుటుంబానికి మద్దతుగా మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి బయటకు దించకుండా ధర్నా నిర్వహించారు. డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్ గ్రామానికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోలేదు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని తక్షణమే సస్పండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఈక్రమంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీనివాసులును ఎస్పీ యోగేశ్ గౌతమ్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎట్టకేలకు ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.