గద్వాల, మార్చి 4 : భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో బాధిత మహిళ హల్చల్ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన గోకారిబీకి 416 సర్వే నంబర్లో ఎకరా పొలం ఉన్నది. అయితే, అధికారుల తప్పిదంతో రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమిగా నమోదైంది. కాగా, ఆ భూమిని రికార్డులో తన పేరిట మార్చాలని కోరుతూ బా ధిత మహిళ కొన్ని రోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నది.
అ యినా అధికారులు పట్టించుకోకపోవడంతో అదనపు రెవెన్యూ కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగులమందు తాగేందుకు యత్నించింది. అటూఇటూ పొర్లుతూ హల్చల్ చేసింది. గమనించిన అధికారులు అడ్డుకొని పోలీసులకు అప్పజెప్పారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు.