కోస్గి, జనవరి 8: రెండు నెలలు గడిస్తే పదో తరగతి పరీక్షలు..కానీ జీవశాస్త్ర పాఠ్యాంశాలు మాత్రం ముందుకు సాగడంలేదు. దీంతో విద్యార్థులు మేము పాసయ్యేదెలా అంటూ వాపోతున్నారు. మండల విద్యాశాఖాధికారి అంజలీదేవి ప్రదానోపాధ్యాయురాలిగా ఉన్న పాఠశాలలోనే జీవశాస్త్రం సబ్జెక్టుకు ఉపాధ్యాయుడి కొరత ఉంది. పక్కనున్న ఏదో ఒక పాఠశాల నుంచి జీవశాస్త్ర ఉపాధ్యాయుడిని కొన్ని రోజులు పదోతరగతి విద్యార్థులకైనా పాఠ్యాంశాలు బోధించేలా చూడాలని కోరుతున్నారు.
అయితే అదే పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న వెంకటయ్య తో జీవశాస్త్రం పాఠాలు చదివించి అయ్యిందనిపిస్తున్నారు. దీంతో విద్యార్థులకు అర్థంకాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా పాఠ్యాంశాలు బోధించాలని విద్యార్థులు పదేపదే ప్రధానోపా ధ్యాయురాలికి ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయింది.
ఉపాధ్యాయుడిని నియమిస్తాం
తాత్కాలికంగా జీవశాస్త్రం బోదించేందుకు ఎవరైనా ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై నియమిస్తాం పదో తరగతి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తాం. పదోతరగతి పరీక్షలకు రెండు నెలల సమయం ఉంది. నెలలోగా సిలబస్ పూర్తయ్యేలా ప్రణాళిక రూ పొందించి అమలు చేస్తాం.
– గోవిందరాజులు, డీఈవో