అయిజ, డిసెంబర్ 31 : బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని నాయకులు, కా ర్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్య ల పరిష్కారానికి అహర్నిషలు కృషి చేయాలని, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అ న్నారు. ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సింగిల్ విండో మాజీ చైర్మ న్ సంకాపురం రాములు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో సమస్యల ను పరిష్కరించడంలో ముందుండాలన్నా రు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపడుతామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో గతంలో ఎన్నడూ లేని వి ధంగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున ప్రశ్నించాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత వెంకట్రాములు అన్నారు. అధికారంలోలేమని కుంగిపోకుండా ధైర్యంతో ముం దుకు సాగి సమిష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్దన్, చాంద్నాయక్, శివకుమార్, వెంకటేశ్, జయన్న, ఈశ్వర్, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పౌరాణిక నాటక ప్రదర్శనలపై ప్రజల్లో ఆదరణ తగ్గలేదని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కిష్టాపురంలో హజరత్ షేక్ అల్లీసాహెబ్ తాత ఉర్సు సందర్భంగా 5వ తేదీన నిర్వహించనున్న పౌరాణిక నాటక ప్రదర్శన పోస్టర్లను ఎమ్మె ల్యే ఆవిష్కరించారు. నడిగడ్డలో కళాకారులకు కొదవలేదన్నారు. నాటక కళాకారులను గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.