నల్లమలలో అరుదైన వర్ణప్రాణి
ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ఇండియన్ మూన్ మోత్ నల్లమల అభయారణ్యంలో దర్శనమిచ్చింది. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీప్రాంతంలో ఈ అరుదైన వర్ణప్రాణిని గుర్తించినట్లు హైటికాస్ సంస్థ ప్రతినిధులు గజ్జలబాపురెడ్డి, అఖిల్ తెలిపారు.
- ఇండియన్ మూన్ మోత్గా గుర్తించిన హైటికాస్ సంస్థ
- కేవలం 5 నుంచి 8 రోజుల జీవిత కాలమే దీని ప్రత్యేకత
అచ్చంపేట, జూన్ 24 : ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ఇండియన్ మూన్ మోత్ నల్లమల అభయారణ్యంలో దర్శనమిచ్చింది. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీప్రాంతంలో ఈ అరుదైన వర్ణప్రాణిని గుర్తించినట్లు హైటికాస్ సంస్థ ప్రతినిధులు గజ్జలబాపురెడ్డి, అఖిల్ తెలిపారు. ఆకుపచ్చని రంగు లో విశాలమైన రెక్కలు, వాటి అంచు ల్లో గులాబీరంగు వెనుక భాగంలో పొడవాటి తోకలు, రెక్కలపై కళ్లను తలపించే వలయాలతో ఈ చిమ్మట ప్రకృతి సృష్టించిన అపురూప కళాఖండంలా కనిపిస్తుంది. ప్రపంచంలో అ త్యంత అందమైన చిమ్మట జా తులలో ఇండియన్ మూన్ మోత్ ఒకటిగా గుర్తింపు పొం దింది. ప్రధానంగా రాత్రివేళల్లో చురుకుగా సంచరించే ఈ జీవి కృత్రిమ వెలుతురుకు ఆకర్షితమవుతుంది. ఆరోగ్యకరమై న అడవులు, సమృద్ధిగా జీవవైవిద్యం ఉన్న ప్రాంతాల్లో మా త్రమే ఇవి కనిపిస్తాయి. ఈ కారణంగానే మూన్ మోత్ ఉనికి నల్లమల అటవీ సంపదకు, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతీకంగా భావిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఆహారం తీసుకోకుండానే జీవనం
ఇండియన్ మూన్ మోత్ జీవిత చక్రం అత్యంత విశేషమైనదిగా చెప్పవచ్చు. గుడ్డు, గొంగళిపురుగు, కోశ దశలో అనేక వారాలు గడిపిన అనంతరం పూర్తిస్థాయి చిమ్మటగా బయటకు వచ్చే ఈ జీవి. వయోజన దశలో కేవలం 5నుంచి 8రోజుల వరకు మాత్రమే జీవిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దశలో దీనికి నోరు పనిచేయదు. గొంగళి పురుగు దశలో నిల్వచేసుకున్న శక్తితోనే జీవిస్తూ సంతానోత్పత్తి జరిపి తన జీవన చక్రాన్ని ముగిస్తుంది. ఈ చిమ్మట వెనుక రెక్కలకు ఉండే పొడవాటి తోకలు కేవలం అందం కోసమే కాకుండా రక్షణ కవచంగా కూడా పనిచేస్తాయని తెలిపారు. రాత్రి సమయంలో వేటాడే గబ్బిలాలు విడుదల చేసే ధ్వని తరంగాలను ఈ తోకలు దారి మళ్లించడంతో దాడి నుంచి మూన్ మోత్ తప్పించుకుంటుంది. ప్రకృతి ఒడిలో కొద్దిరోజుల జీవితాన్ని గడిపినా తన అపూర్వమైన అందంతో, అద్భుతమైన జీవన విధానంతో ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఇండియన్ మూన్ మోత్. నల్లమల అటవీప్రాంత ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన రాత్రిచర కీటకాలలో ఒకటిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ జీవి నల్లమల అటవీప్రాంతంలోని గుండం ప్రాంతంలో దర్శినమిచ్చింది.
సఫారీ టూర్లో పులి ప్రత్యక్షం
అమ్రాబాద్, జూన్ 24 : అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో మండలంలోని ఫరహాబాద్ చౌరస్తా నుంచి అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఫారీ యాత్రలో బుధవారం గుండం సమీపంలో పర్యాటకులకు పెద్దపులి కనిపించింది. ఏటీఆర్లో సఫారీలో భాగంగా తరుచుగా పెద్దపులులు కనిపించడంతో పర్యాటకులు హర్షం వ్వక్తం చేస్తూ పెద్దపులి ఫొటోలను, వీడియోలను వారి ఫోన్లలో బంధిస్తున్నారు. తరచూ అటవీ జంతువులు కనిపిస్తుండడంతో సఫారీ యాత్రకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

