Road Accident | బిజినేపల్లి, మార్చి 14 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన రమేష్ (38) అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహానంపై వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. కాగా శాయిన్పల్లి గ్రామంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహానం అదుపు తప్పడంతో రమేష్ అక్కడిక్కడే మృతి చెందగ, అతని స్నేహితుడిని చికిత్స కోసం నాగర్ కర్నూల్లోని ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.