ఆత్మకూరు, సెప్టెంబర్ 8 : వరదనీటిలో కొట్టుకుపోయి పశువుల కాపరి మృతిచెందిన ఘటన మండలంలోని మేడెపల్లిలో చోటుచేసుకున్నది. మేడెపల్లికి చెందిన గొల్ల తిరుపతన్న(45) పశువులను మేపేందుకు శనివారం రామన్‌పాడు డ్యాం వైపు వెళ్లాడు.
సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా, దొరాయికుంట వద్ద పారుతున్న వాగులో కాలుజారిపడి వరద ధాటికి కొట్టుకపోయాడు. గ్రామస్తులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం కుంటకు కిలోమీటరు దూ రంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తమ్ముడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.