కోస్గి, జనవరి 7 : కొత్తపల్లి మండలంలోని మిరపతోటలో గంజాయి సాగు చేసిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీస్, రెవెన్యూ అధికారులు ఆదివారం ప ట్టుకున్నారు. పోలీసులు కథనం మేరకు.. కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన మున్నూర్ నర్సింహులు వ్యవసాయ పొలంలో సాగు చేసిన మిరపతోటలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు స మాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి కేజీ 315 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నర్సింహులును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపా రు. దాడుల్లో తాసీల్దార్ అనిల్‌కుమార్, కోస్గి సీఐ జనార్దన్, ఎస్సై సురేశ్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.