గద్వాల, ఆగస్టు 26 : ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో 24 గేట్లను ఎత్తి దిగువకు వరదను వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.855 టీ ఎంసీలుగా ఉన్న ది. కాగా, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, ఎడమ కాల్వకు 820 , కుడి కాల్వ కు 496, కో యిల్సాగర్కు 315, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 100 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఐదు యూనిట్లలో 31, 689 క్యూసెక్కులను వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 1,29,228 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
అయిజ, ఆగస్టు 26 : కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 75,694, అవుట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠస్థాయి నీటి మట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.53 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 127.10 టీఎంసీల నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.10 లక్షలు, అవుట్‌ఫ్లో 1, 20,800 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1614.07 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 36.91 టీఎంసీలుగా ఉన్నది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 20,481, అవుట్‌ఫ్లో 10,075 క్యూసెక్కులుగా ఉన్నది. గరిష్ఠ నీటి నిల్వ 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తు తం 86.876 టీఎంసీల నిల్వ ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 4,329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 3,700 క్యూసెక్కుల వరద సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 629 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 8.6 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు ఆయా ప్రాజెక్టుల అధికారులు వెల్లడించారు.