మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే 18 : మద్యం దుకాణంలో బీరు కొ నేందుకు వెళ్లగా జరిగిన చిన్న గొడవలో షాపు నిర్వాహకులు మూకుమ్మడిగా దాడి చేసి ఓ యువకుడి హత్యకు కారకులైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ చనిపోయి నాలుగు రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధిత కుటుంబసభ్యులు ఉన్నతాధికారులను ఆశ్రయించడం.. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘రెచ్చిపోతున్న మద్యం మాఫియా’ శీర్షిక న కథనం ప్రచురితం కావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు కారణమైన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్ తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 25న బండమీదిపల్లిలోని మల్లికార్జున్ వైన్స్ వద్ద జ రిగిన గొడవలో గాయపడిన శ్రీకాంత్ (25) యశో ద దవాఖానలో చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతిచెందాడు. అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన బాదిగోల్ల శ్రీకాంత్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితా ల్లో రెండు మార్కులతో ఉద్యోగం సాధించలేకపోయాడు. గత నెల 25న అల్లీపూర్లో తన మిత్రుడి గృహప్రవేశానికి వచ్చాడు. ఈక్రమంలో మల్లికార్జు న వైన్స్ వద్దకు శ్రీకాంత్‌తోపాటు అతని మిత్రుడు కూడా వెళ్లాడు.
బీర్లు కావాలని అడుగగా కౌంటర్‌పై కూర్చున్న చింతలపల్లి రవికుమార్‌రెడ్డి లేవని దురుసుగా మాట్లాడాడు. ఈ విషయాన్ని శ్రీకాంత్ తన మిత్రులకు చెప్పగా వారు అక్కడికి వచ్చి అడుగుతుండగా.. వైన్స్ వద్దనున్న అరుణ్‌కుమార్‌రెడ్డితో సహా అతడి స్నేహితులు మీకు మమ్మల్ని అడిగే ధైర్యం వ చ్చిందా? మిమ్మల్ని తంతే ఎవరూ మాట్లాడరని చెప్పి శ్రీకాంత్‌పై దాడి కి దిగి పిడిగుద్దులు గుద్దారు. అదిచాలదన్నట్లు షాప్ వెనుక ఉన్న రూం లో బంధించి దిర్శానం రాకేశ్, కోట్ల ప్రవీణ్‌కుమార్ రెడ్డి, శివశంకర్, కోట్ల కృష్ణారెడ్డి, పికిలి వెంకటేశ్, జరపటి చెన్నమ్మ, గోజగౌనీ చంద్రప్రకాశ్‌గౌడ్, రఘుపతిరెడ్డిలు శ్రీకాంత్ తలను గోడకేసి గు ద్దారు. శ్రీకాంత్ అరుపులు బయట ఉన్న వారికి వి నిపించడంతో నిందితులు అతడిని వదిలేశారు. తీ వ్ర గాయాలతో ఉన్న శ్రీకాంత్‌ను అతని స్నేహితు లు, కుటుంబసభ్యులు కొత్తకోటలోని రాహుల్ ద వాఖానలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడం తో హైదరాబాద్‌కు తరలించారు. ఈక్రమంలో చి కిత్స పొందుతూ ఈ నెల 14న మృతిచెందాడు.
మృతుడి తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దాడి ఘటనను గుర్తించారు. దాడికి కా రణమైన పదిమందిపై హత్యకేసు నమెదు చేశారు. శనివారం ఉదయం మెట్టుగడ్డలో వాహనాలు తని ఖీ చేస్తుండగా ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా శివశంకర్, ర ఘుపతిరెడ్డి పరారీలో ఉన్నారని.. వారిని కూడా త్వ రలో పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా విచారణ చేస్తారని.. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు, ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హత్య కేసు ఛేదించిన వారిలో ఎస్సై విజయ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.