ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పటైతే తెలంగాణలో చీకట్లు అలుము కుంటాయన్న ఆంధ్రాపాలకుల హెచ్చరికలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదీక్షతతో పవర్ (విద్యుత్)ఫుల్ రాష్ట్రంగా మారింది. 2014కు ముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి.. కానీ నేడు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుండడంతో రైతులు, చేతివృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తిరూరల్, ఫిబ్రవరి 26: వనపర్తి జిల్లాలో నేడు విద్యుత్ సరఫరాకు డోకాలేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లో రాత్రివేళ లైట్లు వేసినా దీపం వెలుగు నిచ్చేవి.. లో వోల్టేజీ సమస్యతో వ్యవసాయ బోరు మోటర్లు కాలిపోయి, పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు.. వెల్డింగ్, కార్పెంటర్ పనులు చేసేవారు విద్యుత్ అంతరాయంతో పనులు నడువక తీవ్ర ఇబ్బందు లు పడేవారు. కానీ నేడు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృషితో నిరంతరాయంగా, మెరుగైన విద్యుత్ సరఫరా అవుతుండడంతో రెండు పంటలు పండుతుండడం తో రైతులు, చేతినిండా పనులు ఉండడంతో చేతి వృత్తిదా రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి జిల్లా ఏర్పాటుకు ముందు 28 సబ్ స్టేషన్లు ఉండగా జిల్లా ఏర్పాటయ్యాక రూ. 46 కోట్లతో 33 కేవీ కెపాసిటీతో మరో 28 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయగా మరో 15 సబ్ స్టేషన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. జిల్లాలో 2014 మార్చి 31 వరకు 1,36,000 వేల కనెక్షన్లు ఉండగా ప్రస్తు తం రెండు లక్షలకుపైగా ఉండగా అందులో 1,45,254 గృహ అవసరాలు కాగా నాన్ డోమెస్టిక్ కనెక్షన్లు 19,875, చిన్న, పెద్ద పరిశ్రమల కనెక్షన్లు 19,875, వ్యవసాయ కనెక్షన్లు 56,585, వీధి దీపాలు, ఆర్డబ్ల్యూ ఎస్, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు తదితర వాటికి సంబంధించి 3 వేలకు పైగా కనెక్షన్లు ఉండగా నెలకు రూ.7 కోట్ల విద్యుత్ బిల్లులు వసూ లౌతు న్నట్లు విద్యుత్ శాఖ అధికారుల సమాచారం. అలాగే జిల్లాలో విద్యుత్ స్తం భాలు, తీగలు పంటి పరికరాల సమస్య తలెత్తకుండా జిల్లా కేంద్రంలో స్టోర్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
జిల్లాలో గృహ, పరిశ్రమలు, వ్యవసా యరంగానికి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు క్షేత్రస్థాయిలో మా సిబ్బంది పని చేస్తున్నారు. నిరంతరా యంగా సరఫరా అవుతున్న విద్యుత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా రైతులు అవసరం కొద్ది వినియోగించుకోవాలి. అప్పుడే ప్రభుత్వం అందిస్తున్న సేవలకు ఫలితం ఉంటుంది.
– నాగేంద్రకుమార్, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ
రాష్ట్రం రాకముందు ఏ ఆర్థరాత్రి కరెంటు వస్తుందో తెలి యని పరిస్థితి. దాంతో రాత్రి వేళ పొలం వద్దే పడిగాపులు కాసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పుష్కలంగా కరెం టు ఉండంతో వీలైనపుడు వెళ్లి పంటకు నీరు పెట్టుకుంటు న్నాం. ఇబ్బంది లేకుండా రెండు పంటలు పండుతున్నాయి.
-తిరుపతయ్య గౌడ్, రైతు, కడుకుంట్ల గ్రామం
గతంలో కరెంటు సమస్య వల్ల కస్ట మర్లకు సరియైన సమయంలో వారు చెప్పినవి చేసి ఇవ్వలేక ఇబ్బందులు పడేవారం. దీంతో పని మానేసి వేరే ని చేసుకోవాలనుకున్నా. కాని ఇప్పు డు కరెంట్ 24 గంటలు ఉండడంతో సరి యైన సమయం లో కస్టమర్లకు వస్తువులు అందించగలుగుతున్నాం.
– పాషా, కార్పెంటర్, వనపర్తి