గద్వాల, జూన్ 13 : ఏదైనా మిల్లుకు ధాన్యం కేటాయించాలంటే ముందుగా కలెక్టర్ అనుమతి తీసుకొని సివిల్ సప్లయ్ అధికారులు ఆయన ఆదేశానుసారంగా మిల్లులకు వడ్లు కేటాయించాలి.. కా నీ ఇక్కడ అలాంటివి ఏవీ జరగవు.. గద్వాల జి ల్లాలో ఆ నలుగురు ఏది చెబితే అదే వేదంగా భా వించి అధికారులు ఫైనల్ చేస్తారు.. ఇక్కడ అధికారుల పాత్ర నామమాత్రంగా ఉంటుంది.. ఆ నలుగురు ఇచ్చే మామూళ్లకు ఆశపడి సివిల్ సప్లయ్ అధికారులు చిన్న, కొత్త మిల్లుల యజమానుల పొట్టగొడుతున్నారు.. ఆ నలుగురి అండ చూసుకొని వారితోపాటు కొంత మంది మిల్లుల యజమానులు 2022-2023 యాసంగికి సంబంధించి ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన వరి ధాన్యం అమ్ముకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు రూ.10 కోట్ల బియ్యం పక్కదారి పట్టినా అధికారులు కేసులతో సరి పెట్టారే తప్పా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ.కోటి విలువ చేయని మిల్లులకు రెండు కోట్లకుపైగా విలువ చేసే ధాన్యం ఎత్తగా వా రు దానిని అమ్ముకొని రూ.కోట్లకు పడగలెత్తారు. 2022 యాసంగికి సంబంధించి మిల్లర్లు బియ్యం ప్రభుత్వానికి ఇవ్వలేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించినా ఇక్కడి అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారు. పక్కదారి పట్టిన వడ్లపై విచారణ చేయాలని పోలీస్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించగా వారిపై ఒత్తిడి తెచ్చి విచార ణ కొనసాగకుండా చేశారు.
జిల్లాలోని పలుకు బడి న కలిగిన కొంత మంది మిల్లర్లు ప్రభుత్వానికి సు మారు 100లారీల బియ్యం ఇవ్వాలని ఈ బి య్యం పక్కదారి పట్టిందని పోలీస్ నివేదికలో తేలినట్లు సమాచారం. అయితే ఆ విషయం బయట కు రాకుండా రాజకీయ నాయకులతో పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. చివరకు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి బదులు డబ్బులు చెల్లిస్తామని అవినీతికి పాల్పడ్డ మిల్లుల యజమానులు ఒప్పుకోగా అవి కూడా చెల్లించకుండా కాలయాప న చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో ఆ నలుగురు చె ప్పిందే వేదంగా సివిల్ సప్లయ్‌శాఖలో కార్యాకలాపాలు కొనసాగుతున్నాయి.
ఈ యాసంగిలో జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుకున్న స్థాయిలో ధా న్యం పండలేదు. అయితే తెలంగాణలో ని ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి అధికారులు ధాన్యం తె ప్పించగా మిల్లులకు వాటిని కేటాయింపులో కూ డా వారి పెత్తనం నడుస్తుండడంతో మిగతా మి ల్లుల యజమానులకు ఏం చేయాలో పాలు పోవ డం లేదు. గద్వాల జిల్లాకు మెదక్‌తోపాటు ఇతర జిల్లాల నుంచి 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మర ఆడించడానికి అనుమతించగా అందులో కూ డా వీరి పాత్రే కీలకం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ధాన్యంలో అధికారులు ఇప్పటి వరకు అందులో 17వేల మెట్రిక్ టన్నులు మిల్లులకు కేటాయించగా ఇంకా మూడు వేల మెట్రిక్ టన్నులు మిల్లులకు కేటాయించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది.
వాస్తవంగా ప్రస్తుతం నడుస్తున్న బాయిల్డ్ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించాలి. ఇక్కడి అధికారులు మాత్రం ఒక బాయిల్డ్ మిల్లు నిర్మాణ పను లు జరుగుతుండగానే ధాన్యం కేటాయింపులు చేశా రు. అక్కడ ఒక్క గింజ కూడా మర ఆడించలేదు. పనులు పూర్తవుతాయో లేదో కూడా తెలియదు కానీ.. అటువంటి మిల్లుకు ఇక్కడి అధికారులు సుమారు 40వేల బస్తాలపైనే వరిధాన్యం మర ఆడించడానికి కేటాయించారంటే ఇక్కడ వారి ప్రాబల్యం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతున్నది.
వాస్తవంగా కొత్త మిల్లులకు ధాన్యం కేటాయించే సమయంలో వారు మర ఆడించినట్లు కరెంట్ బిల్లుతోపాటు అధికారులు పరిశీలించిన తర్వాత అన్ని ఒకే అంటేనే ధాన్యం కేటాయింపులు చేయాలి. కానీ అధికారులు అవేవి పట్టించుకోకుండా కొన్ని రోజుల్లో మిల్లు పనులు పూర్తవుతాయని భావించి ధాన్యం కేటాయించినట్లు తెలిసింది. అధికారుల అండతో ఆ నలుగురు చేస్తున్న దందాలను అరికట్టి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కొత్త, చిన్న మిల్లుల యజమానులు కోరుతున్నారు.
ఆ నలుగురు మిల్లర్లు ఆడించిన బియ్యం పాస్ అంటే పాస్.. ఫెయిల్ అంటే ఫెయిల్ అనే స్థాయికి ఎదిగారు. ప్రభుత్వం మిల్లులకు ఇచ్చిన వరి ధాన్యం మర ఆడించిన తర్వాత వాటిని గోదాంకు తరలిస్తా రు. గోదాం స్టాక్ పాయింట్ దగ్గర పాయింట్ అధికారి వాటిని పరిశీలించి పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పాలి. అయితే ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గర ఉండే అధికారి పాత్ర నామమాత్రం. ఒకవేళ బి య్యం లోడ్ పాస్ కాకపోతే ఆ మిల్లు యజమానికి సుమారు రూ.70వేల వరకు నష్టం వస్తుందని మి ల్లు యజమానులు వాపోతున్నారు. ఆ నలుగురు మిల్లర్ల ధాన్యం, వారికి అనుకూలమైన మిల్లర్ల ధా న్యం స్టాక్ పాయింట్‌కు తీసుకొస్తే అవి మంచిగా ఉ న్నా లేకున్నా పాస్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వీరి మూలంగా కొత్త, చిన్న మి ల్లుల యజమానులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తున్నది.
వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం జిల్లాలోని అన్ని మిల్లులకు సమానంగా సరఫరా చేయాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఎవరైతే ఆ నలుగురు ఉన్నారో మొదటి నుంచి వరి ధాన్యం వారి మిల్లులకు తరలించుకొని మిగతా మిల్లులకు నాణ్యత లేని ధాన్యం పంపుతున్నట్లు తెలిసింది. దీంతోపాటు ఆ నలుగురు మిల్లులకు ఎక్కువ ధాన్యం కేటాయింపులు అధికారులతో చేయించుకొని చిన్న మిల్లులకు తక్కువ వరి ధాన్యం కేటాయించడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని చిన్న మిల్లుల యజమానులు వాపోతున్నారు. అందరికీ సమానంగా ధాన్యం పంపిణీ చేయాలని వేడుకుంటున్నా వారి మాటలు పట్టించుకోకుండా వారిపై పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలిసింది.