వనపర్తి, ఆగస్టు 8 : ఏ వృత్తిలోనైనా నిబద్ధతతో పనిచేస్తే తగిన డబ్బు, గౌరవం లభిస్తాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ని ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్ సంఘం స భ్యులు 350 మంది అధ్యక్షుడు గోవర్ధన్ సాగర్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, గుర్తించి ఒకేసారి ఇంత మంది బీఆర్ఎస్లో చేరడం ఆనందంగా ఉందన్నారు. మనం చేసే పనిని చిన్నదని ఎవరూ భావించవద్దని, నిబద్ధతతో పనిచేస్తే అందులో గౌరవం లభిస్తుందన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తుమన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. తొమ్మిదేండ్ల కిందటి పరిస్థితులు, నేడు చేపట్టిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని కోరారు.
సాగునీరు, కరెంటు లేక వలస లు వెళ్లేవారని, నేడు పచ్చనిపంటలతో పల్లెలు కళకళలాడుతున్నాయన్నారు. అంతేకాకుండా కులవృత్తులకు ప్రభు త్వం పెద్దపీట వేసి ఆదుకుంటున్నదన్నా రు. అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ చేయా లని సూచించారు. తండాల్లో, గ్రామాల్లో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను చూ స్తుంటే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందన్నా రు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం లో అటవీశాతం 7.7 శాతం పెరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్, మెడికల్, మత్స్య, వ్యవసాయ కళాశాల ల ఏర్పాటుతో వనపర్తి భవిష్యత్ సమూలంగా మారబోతున్నదన్నారు. ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్ కార్మికుల భవన నిర్మాణానికి స్థలం కేటాయించి భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కా ర్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రమోద్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, శిక్షణా తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థి చదువుకు ఆర్థికసాయం..
మండలంలోని దొడగుంటపల్లికి చెందిన కొమ్ము నందకుమార్ మహారాష్ట్ర యూనివర్సిటీలో సీటు సాధించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేదు. విష యం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకు డు సురేశ్‌కుమార్ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, స్పందించి విద్యార్థి నందకుమార్ ఉన్నత చదువుల కోసం రూ.50వేల ఆర్థికసాయాన్ని మం గళవారం అందజేశారు. పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరు కోవాలన్నా రు. అనంతరం మంత్రికి నందకుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకు లు చెన్నయ్య, ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.