మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 10 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సంచారజాతుల కు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఆసరా లభించిందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం న్యూటౌన్‌లో ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం బేడ బు డగ జంగం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సిరిగిరి శ్రీను, బీఆర్ఎస్ నాయకుడు ఎండీ ఖాజాపాషా ఆధ్వర్యంలో సుమారు 300 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో చేరారు. చేరిన వారికి మంత్రి గులాబీ కండువా కప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత జిల్లాలో మొదటిసారిగా బే డ బుడగజంగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
బుడగజంగాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనానికి నిధులు అందించినట్లు గుర్తు చేశారు. బుడగజంగాలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారికి తెలియజేయాలన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ ప్రపంచం లో మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్గా మార్చారన్నారు. తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్, మిషన్‌భగీరథ, కల్యాణలక్ష్మి, ఆస రా పింఛన్లు తదితర పథకాలను అమలు చేయడమే ల క్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు, ముడా చైర్మన్ గంజి వెంకన్నముదిరాజ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజు, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రా ష్ట్ర అధ్యక్షుడు కోడిగంటి నర్సింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రమేశ్, మాజీ జెడ్పీటీసీ చంద్రమౌలి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.