వనపర్తి, ఆగస్టు 3 : వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సాగునీటి రా కతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పెద్దమందడి మం డలం మోజర్ల సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో 30 మంది కాంగ్రెస్ నాయకులు గురువారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, సాగునీ ళ్లు అందించడంతో రైతులు పంటలను సంబురంగా సా గుచేసుకుంటున్నారన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రా మాల రూపురేఖలు మారాయన్నారు.
ఆసరా పింఛన్‌తో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు తెలంగాణ సర్కార్ అండగా నిలిచిందన్నారు. క ల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత, బీసీ బంధు పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. మి షన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీరు అందిస్తు న్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో ఎం డాకాలంలోనే నీటితో తొణికిసలాడుతున్నాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజ లు అండగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎ స్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, గ్రామ అధ్యక్షుడు సతీ శ్, యువజన అధ్యక్షుడు అరవింద్ తదితరులున్నారు.