దేవరకద్ర/దేవరకద్ర రూరల్/కొత్తకో ట, ఆగస్టు 4 : తెలంగాణలో ప్రపంచస్థా యి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయ ని వాటిని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ఎ క్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపలి కృష్ణారావు తెలిపారు. ఆదివారం పర్యాటక స్టడీ టూర్లో భాగంగా మండలంలో ని కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఉమ్మడి జి ల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నాగరకర్నూ ల్ ఎంపీ మల్లు రవితో కలిసి పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన పు ణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక కట్టడాలు అనేకంగా ఉన్నాయన్నారు.
కోయిల్‌సాగర్ అంతర్రాష్ట్ర రహదారికి సమీపంలో ఉండడంతో ఈ ప్రాజెక్టును పర్యాటక ప్రాం తంగా తయారు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రాజెక్టు దగ్గర ఏకో పార్కు, బోటింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని వివి ధ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు రూ.3కోట్ల నిధులు తక్షణ మే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
కురుమూర్తిని పర్యాటక
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పిలువబడే కురుమూర్తి క్షే త్రాన్ని సకల సౌకర్యాలతో పర్యాటక కేం ద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి స్టడీ టూర్లో భాగంగా మంత్రి కురుమూర్తిస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇ తర రాష్ర్టాల నుంచి భక్తులు లక్షల సం ఖ్యలో తరలివస్తారని, అందుకోసం ఆల య ప్రాంగణంలో భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు కృషి చే స్తామన్నారు. అలాగే భక్తులు బస చేసేందుకు అవసరం మేరకు కాటేజ్‌ల నిర్మాణాలు చేపడుతామన్నారు.
అనంతరం వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలో రెండోదైన ఆటోమెటిక్ సైఫన్ సిస్టమ్ గల సరళాసాగర్ ప్రాజెక్టుతోపాటు కోయిల్‌సాగర్ ప ర్యాటక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమా ల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కశిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, గద్వాల మాజీ జెడ్పీచైర్‌పర్సన్ సరిత తదితరులు ఉన్నారు.